Posts

Meanings

Image
 విశ్వమ్  --------- భగవంతుడి పూర్ణత్వానికి ప్రతీకగా ఆయనని విశ్వం అన్నారు. భగవంతుడికి సమస్త విశ్వం శరీరం. విశ్వం అన్నంత మాత్రాన ఈ విశ్వమే భగవంతుడు కాదు. ఆయనకి చెంది ఆయనకి శరీరమై ఉన్నది.  విశ్ ధాతువుకు ప్రవేశించి ఉండటం అనేది అర్థం. అంటే ఒకప్పుడు లేడు అని కాదు! ఈ సమస్త జగత్తులోనూ ఈశ్వరుడు అనే వాడు ఒకడు ప్రవేశించి ఉండటం వల్లే దీనికి విశ్వం అని పేరు వచ్చింది. ఈ విధంగా విశ్వం అనే పేరే నాస్తిక వాదాన్ని తిరస్కరిస్తుంది.  విష్ణుః -------- ఈ విధంగా సర్వమూ వ్యాపించి అన్నిట్లోనూ ప్రవేశించి ఉండటం వల్ల పరమాత్మని విష్ణువు అన్నారు. వషట్కారః   -------------- ఇంతకు ముందు పరమాత్మ సర్వ వ్యాపి అనీ, విశ్వరూపుడనీ సేవించుకున్నాం.  విశ్వానికి ఆ పేరు రావడానికే కారణం ఈశ్వర సంబంధం అని కూడా చెప్పుకున్నాం.  ఇప్పుడు వషట్కారుడు అంటే ఏమిటో చూద్దాం.  భగవంతుడు సర్వత్ర ఉండటంలో కూడా, అది స్వతస్సిద్ధం అయినా, ఒక ప్రయోజనం ఉంది. అది సర్వాన్నీ వశపరుచుకొని ఉండటం.  ఈవిధంగా తన స్వేచ్చతో సమస్తాన్నీ వశపరచుకుంటాడు కాబట్టి స్వామిని వషట్కారుడు అన్నారు.  భూతభవ్యభవత్ ప్రభుః  --------...

Poorva peethika

శ్రీవిష్ణు సహస్రనామం పూర్వపీఠిక వ్యాఖ్యానంలో -  భక్తి, ధ్యానం, జపం - వీటికి ఎంతో ఉదారమైన నిర్వచనాలని పరాశర భట్టర్ వారు మనకు ఇచ్చారు. అవి ఏమిటి అనేవి చూద్దాం. భక్తి - స్వామిని దాసస్య అనురాగమయీ స్థితిః - దాసుడికి స్వామి అంటే అనురాగం ఉండే స్థితి. ఇది ఆయన అనుగ్రహించేదే అని ప్రత్యేకం చెప్పక్కర్లేదు.  ధ్యానం - భగవద్ గుణ అనుచిన్తనం - భగవంతుడి కల్యాణ గుణాల్ని నిరంతరం తలుచుకోవడం (ఇది ఆయన తలుచుకుంటేనే జరుగుతుంది అని నాన్ముగన్ తిరువందాదిలో తిరుమళిశై ఆళ్వార్లు బోధిస్తారు - నిరందరం నినైప్ప దాగ నీ నినైక్క వేండుమే).  జపం - నియమ విశేషవత్ మంత్రాది ఆవర్తనం - ఏదైనా ఒక నియమం అనుసరించి మంత్రాలు మొదలైన వాటిని మళ్ళీ మళ్ళీ చెప్పడం.  శ్రీవిష్ణు సహస్రనామం జపం ఎలా అవుతుంది అంటే - ఒకే ఈశ్వరుడి కల్యాణ గుణాల్ని మళ్ళీ మళ్ళీ తలుచుకోవడం వల్ల. శ్రీవైష్ణవ  తెన్నాచార్య సంప్రదాయంలో అష్టాక్షరీ జపం కూడా చెయ్యడం ఉండదు. . అష్టాక్షరీ (నారాయణ) మంత్రాన్నిరోజుకి ఒకసారి ఉచ్ఛరించడమే జపం. అది ప్రతిరోజూ రిపీట్ అవడం వల్ల ఒక విధంగా జపం అవుతుంది!  మరి జపం చెయ్యకపోతే? అంటే మంత్రార్థం తెలుసుకుని...